calender_icon.png 5 July, 2025 | 4:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిఎల్ఓలు విధుల నిర్వహణలో నిష్పక్షపాతంగా ఉండాలి

04-07-2025 10:11:52 PM

తహసీల్దార్ లాలునాయక్ 

పెన్ పహాడ్: బూత్ లెవెల్ అధికారులు తమ విధి నిర్వహణలో నిష్పక్షపాతంగా ఉండాలని తహసిల్దార్ లాలూ నాయక్ అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల కేంద్రంలో మండలంలోని ఆయా గ్రామాల బూత్ లెవెల్ అధికారులు (బిఎల్ఓ) ఎన్నికల నిర్వహణలో భాగంగా నూతన ఓటర్ల నమోదు, అనరుల తొలగింపు, బూతు లెవల్లో ఓటర్ల సవరణ, మార్పు చేయడంపై అవగాహన కల్పించి మాట్లాడారు. ఫామ్ - 6, 7, 8 ఆధారంగా బిఎల్ఓ లు నిష్పక్షపాతంగా వివరాలు నమోదు చేసి కార్యాలయంలో అందజేయాలన్నారు. ఓటర్ నమోదులో వ్యక్తిగత అంశాలు దృష్టిలో పెట్టుకొని పౌరుల ఓటు హక్కును తొలగించడం.. ఇష్టారాజ్యంగా మార్పులు చేర్పులు చేసినట్లు ఫిర్యాధులు అందితే సదరు బిఎల్వో లపై చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యపేట తాసిల్దార్ కృష్ణయ్య, సీనియర్ అసిస్టెంట్ రాధ,  ఎం పి ఎస్ ఓ నవీన్, ఎలక్షన్ ఇంచార్జ్ శ్రీనిధి తదితరులు ఉన్నారు.