24 July, 2026 | 1:36 PM

గుజరాత్‌లో మోదీ మేనియా

05-06-2024 02:23 AM

గుజరాత్‌లోని మొత్తం 26 పార్లమెంటు స్థానాల్లో బీజేపీ 25, కాంగ్రెస్ 1 స్థానంలో విజయం సాధించాయి. బీజేపీ 96.15 శాతం ఓటు బ్యాంకును దక్కించుకుంది. కాంగ్రెస్ కేవలం 4.35 శాతంతో సరిపెట్టుకుంది. బీజేపీకి కంచుకోటగా ఉన్న గుజరాత్‌లో ఎప్పటిలాగే తన హవా కొనసాగించింది. 2014, 2019 ఎన్నికల్లో అన్ని స్థానాలు దక్కించుకొని బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ మాదిరిగానే ఈసారి కూడా భారీ విజయం దక్కించుకుంది. గుజరాత్‌పై ఆప్‌తో పాటు కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించాయి. కొన్నేళ్లుగా బీజేపీని రాష్ట్రంలో దెబ్బతీయాలని పటేల్ ఉద్యమానికి సైతం కాంగ్రెస్  భారీగా మద్దతు ఇచ్చింది. అయినా ఆ రాష్ట్రంలో బీజేపీ హవాకు ఎదురులేకుండా పోయింది. గుజరాత్‌లో మొత్తం 4.95 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. మే 7న ఒకే దశలో పోలింగ్ జరిగింది.