ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ప్రభంజనం
05-06-2024 02:25 AM
ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 11 లోక్‌సభ స్థానాల్లో ఎన్నికలు జరగ్గా బీజేపీ 10 స్థానాల్లో భారీ విజయం సాధించింది. ఇక, కాంగ్రెస్ కేవలం ఒక్క సీటుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బీజేపీ 90.01 శాతం, కాంగ్రెస్ 9.09 శాతం ఓట్ షేర్ సాధించాయి. ఛత్తీస్‌ఘడ్ మొత్తం 2.05 కోట్ల మంది ఓటర్లు కలిగి ఉంది. కాగా, బీజేపీ గత ఎన్నికల్లో 9 సీట్లలో విజయం సాధించగా.. ఈసారి అంతకుమించి 10 స్థానాలు దక్కించుకుంది. కాగా, ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం మూడు దశల్లో ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7న ఎన్నికలు నిర్వహించారు.






