17-07-2025 12:00:40 AM
గల్వాన్ ఘర్షణ తర్వాత తొలిసారి డ్రాగన్ దేశానికి
న్యూఢిల్లీ, జూలై 10: భారత ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో చైనాలో పర్యటించనున్నట్టు తెలుస్తోంది. వచ్చే నెలలో జరగనున్న ఎస్‌సీవో శిఖరాగ్ర సదస్సుకు మోదీ హాజరవుతారని సమాచారం. 2020లో తూర్పు లడాఖ్‌లోని గల్వాన్ లోయలో సైనికుల మధ్య ఘర్షణతో చైనా భారత్ మధ్య దౌత్య సంబంధాలు స్తంభించిన అనంతరం చైనాలో మోదీ పర్యటించనుండటం ఇదే తొలిసారి.
అయితే మోదీ పర్యటనను అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. తియాంజిన్ వేదికగా షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు ఆగస్టు 31 1 తేదీల్లో జరగనుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఎస్‌సీవో సభ్య దేశాల నేతలు కూడా ఈ సదస్సుకు హాజరుకానున్నారు. చైనా పర్యటనలో భాగంగా దేశాధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశముంది.