calender_icon.png 18 September, 2025 | 3:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తీన్మార్ మల్లన్న జాతీయ కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని రద్దు చేస్తున్నాం

18-09-2025 01:35:46 AM

బీసీ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు రామకృష్ణయ్య 

ఖైరతాబాద్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి)  ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీని కొనుగోలు చేసినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని, జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షునిగా పార్టీలో కొనసాగుతున్నారని అట్టి పదవిని రద్దు చేస్తున్నామని బీసీ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు  రామకృ ష్ణయ్య తెలిపారు. ఈ మేరకు బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తీన్మార్ మల్లన్న బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీ ఆఫీసుకు సంగం సూర్యారావు అనే వ్యక్తి ద్వారా  పదే పదే వచ్చి ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడుగా నియమించాలని అడిగారని అన్నారు.

అందుకు తాను అంగీకరిం చక జాతీయ కార్యనిర్వాక అధ్యక్షునిగా నియమిస్తానని చెబితే అందుకు అంగీకరించి వెళ్లిపోయారని అన్నారు. ఈ మేరకు గత ఆగస్టు నెల 30వ తారీఖున నియామక పత్రాన్ని తీసుకొని వెళ్లారని తెలిపారు. తదనంతరం సోషల్ మీడియాలో రామకృష్ణ య్యకు భారీగా డబ్బులు ఇచ్చి తీన్మార్ మల్లన్న బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీని కొన్నారని సోషల్ మీడియా ద్వారా ప్రచా రం చేయడం మొదలు పెట్టాడని ఆరోపించారు.

తదనంతరం తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ స్థాపిస్తున్నారని వార్తలు రావడంతో పార్టీ జాతీయ  ప్రధాన కార్యదర్శి నరేందర్ గౌడ్ ఫోన్ ద్వారా సంప్రదించగా జాతీయ అధ్యక్ష పదవి ప్రకటిస్తే పార్టీలో చేరుతానని లేకపోతే కొత్త పార్టీ ప్రకటిస్తానని తెలపడం జరిగిందని అన్నారు. దీంతో బుధవారం మల్లన్న కొత్త పార్టీ ప్రకటించడంతో యునైటెడ్ ఫ్రంట్ జాతీయ కార్యనిర్వాక అధ్యక్ష పదవిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేకపోతుల నరేందర్ గౌడ్, కోశాధికారి లక్ష్మి, నేషనల్ కోఆర్డినేటర్ వెంకట్, వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిక్షపతి గౌడ్ పాల్గొన్నారు.