మొగిలిగిద్ద పాఠశాల బతుకు పాఠం నేర్పింది
27-05-2024 12:57 AM
నటుడు, నిర్మాత బండ్ల గణేష్
రంగారెడ్డి, మే 26 (విజయక్రాంతి) : తనకు విద్యా బుద్ధులు నేర్పిన గురువుల ప్రోత్సాహం ఎప్పటికి మరిచిపోలేని ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ చెప్పారు. తనకు ఇష్టమైన సినిమా రంగం వైపు అడుగులు వేయడం ముమ్మాటికి ఈ ప్రాంతం చలువనేనని పేర్కొన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం మొగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాలలో 1988 ఏడాదిలో పదవ తరగతి పూర్తి చేసిన పూర్వవిద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. సమ్మేళనానికి పూర్వ విద్యార్థిగా ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిన్న నాటి మిత్రులతో గడిపిన జ్ఙాపకాలను నెమరవేసుకొన్నారు. తోటి మిత్రులతో సరదాగా గడిపారు.






