డబ్బులివ్వాలంటూ ఆటోడ్రైవర్‌పై దాడి
నిందితుడిపై కేసు నమోదు
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 26 (విజయక్రాంతి) : అర్ధరాత్రి వేళ పని ముగిం చుకుని ఇంటికి వెళ్తున్న ఆటోడ్రైవర్‌ను అటకాయించి డబ్బులు ఇవ్వాలంటూ బెదిరిం చడంతో పాటు దాడికి పాల్పడిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం.5లోని దేవరకొండ బస్తీకి చెందిన ఎ.నవీన్(24) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
ఆదివారం అర్ధరాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో దేవరకొండ బస్తీకి చేరుకోగానే స్థానికంగా నివాసం ఉంటున్న సాగర్ అలియాస్ పప్పీ అనే వ్యక్తి ఆటోను అడ్డగించాడు. డబ్బులు ఇవ్వాలంటూ నవీన్‌ను డిమాండ్ చేయగా తనవద్ద లేవని చెప్పాడు. దీంతో ఆగ్రహానికి గురైన సాగర్ తన చేతికి ఉన్న ఐరన్ కడియంతో నవీన్‌పై విచక్షణరహితంగా దాడి చేశాడు. దీంతో, నవీన్ తలకు, ముఖానికి బలమైన గాయాలయ్యాయి. ఘటనపై బాధితుడి సోదరుడు విశ్వనాథ్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఐసీసీ సెక్షన్ 394 కింద సాగర్ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






