calender_icon.png 17 November, 2025 | 12:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్టీఆర్ వీరాభిమాని అగయ్య ఇక లేరు

17-11-2025 11:08:48 AM

కరీంనగర్,(విజయక్రాంతి): ఎన్టీఆర్(N T Rama Rao) వీరాభిమాని, కరీంనగర్ కు చెందిన సీనియర్ టీడీపీ నాయకుడు(Senior TDP leader) కళ్యాడపు ఆగయ్య(72) సోమవారం కన్నుమూశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీని వీడకుండా ఉన్న  కరీంనగర్ నేత అగయ్య గుండె పోటుతో తుది శ్వాశ విడిచారు. ప్రస్తుతం కరీంనగర్  టిడిపి నియోజకవర్గ కన్వీనర్ గా, రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న ఆగయ్య పార్టీలో చంద్రబాబు(Nara Chandrababu Naidu) కంటే సీనియర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవలే మహానాడులో ఆగయ్యకు  చంద్రబాబు, సినీ నటుడు బాలకృష్ణ(Nandamuri Balakrishna) సన్మానించారు. ఎక్కడున్నా పేరు పెట్టి పిలిచేంతగా ఎన్టీఆర్ కుటుంబంలో తెలిసిన వ్యక్తిగా ఆగయ్యకు గుర్తింపు ఉంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం కంటే ముందు నుంచే ఎన్టీఆర్ కు అభిమాన సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఆగయ్య మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.