02-10-2025 02:09:44 AM
టాలీవుడ్ హీరో సుధీర్‌బాబు, బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మైథలాజికల్ థ్రిల్లర్ ‘జటాధర’. ఈ పాన్-ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్‌కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. పౌరాణిక ఇతివృత్తంతో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో దివ్యఖో స్లా, శిల్పా శిరోధ్కర్, ఇంద్రకృష్ణ, రవిప్రకాశ్, నవీన్ నేని, రోహిత్ పాఠక్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.
ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన కంటెంట్‌కు మంచి స్పందన దక్కింది. విజయదశమి కానుకగా ఈ సినిమాలోని ‘ధన పిశాచి’ సాంగ్‌ను మేకర్స్ బుధవారం రిలీజ్ చేశారు. సమీరా కొప్పికర్ స్వరపర్చిన ఈ గీతానికి శ్రీహర్ష ఈమని సాహిత్యం అందించగా, సాహితీ చాగంటి ఆలపించారు.
‘ప్రేత ఆకారి.. భూత ఆహారి.. సూర్య సంచారీ.. దుర అహంకారీ..’ అంటూ సాగుతున్న ఈ పాటలో సోనాక్షి సిన్హా పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. ఉమేశ్‌కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేర ణ అరోరా, శిల్పా సింగ్‌హల్, నిఖిల్ నందా నిర్మించిన ఈ సినిమా నవంబర్ 7న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది.