calender_icon.png 2 October, 2025 | 7:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సరికొత్తగా మటన్ సూప్

02-10-2025 02:08:24 AM

రమణ్, వర్షా విశ్వనాథ్ హీరోహీరోయిన్లుగా రామచంద్ర వట్టికూటి తెరకెక్కించిన చిత్రం ‘మటన్ సూప్’. ‘విట్‌నెస్ ది రియల్ క్రైమ్’ అనేది ట్యాగ్‌లైన్. అలుక్కా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్ చిత్రాలు బ్యానర్లపై మల్లికార్జున ఎలికా (గోపాల్), రామకృష్ణ సనపల, అరుణ్‌చంద్ర వట్టికూటి నిర్మిస్తున్నారు. అక్టోబర్ 10న విడుదల కానున్న ఈ మూవీ టైటిల్, మోషన్ పోస్టర్లు, పాటలు ఇప్పటికే విడుదలై అందనీ ఆకట్టుకున్నాయి.

రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో దసరా సందర్భంగా బుధవారం ఈ సినిమా టీజర్‌ను టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదల చేసి, టీమ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘సరికొత్త టైటిల్‌తో వస్తున్న కొత్త టీమ్‌ను ఆదరించాల’ని అన్నారు.

ఈ కార్యక్రమంలో హీరో రమణ్, దర్శకుడు రామచంద్ర వట్టికూటి, నిర్మాతలు మల్లికార్జున, రామకృష్ణ, అరుణ్ చంద్ర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పర్వతనేని రాంబాబు, నటులు జెమిని సురేశ్, గోవింద్ శ్రీనివాస్ పాల్గొన్నారు.