27-11-2025 12:01:38 AM
ఏకగ్రీవంగా ఎన్నికైన మోంగని శ్రీనివాస్
మొయినాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి) : ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి మండల అధ్యక్షునిగా మోంగని శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని ఎన్కేపల్లి గ్రామానికి చెందిన మోంగని శ్రీనివాస్ ను రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు జీనుకుంట్ల భాస్కర్, అధికార ప్రతినిధి వద్ది నిరంజన్, ప్రధాన కార్యదర్శి కాకి వినోద్ ల ఆధ్వర్యంలో ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి మొయినాబాద్ మండల అధ్యక్షునిగా నియమించారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మోంగని శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షుడు కర్నే శ్రీశైలం అన్నా ఆశయాలను ముందుకు తీసుకుపోవడమే లక్ష్యంగా రంగారెడ్డి జిల్లాలోని అన్ని మండలాలలో ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితిని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన తెలిపారు. దేవేందర్, నవీన్, రాహుల్, నాగరాజు, మహేష్, రాజు, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.