27-11-2025 05:36:39 PM
బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఎన్నం ప్రకాష్..
ముకరంపుర (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పట్ల మొండి వైఖరి వీడాలని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఎన్నం ప్రకాష్ డిమాండ్ చేశారు. గురువారం నగరంలోనిరాంనగర్ లో బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాచమల్ల రాజు ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్నం ప్రకాష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు బీసీలకు స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ఎన్నికల డిక్లరేషన్ లో హామీ ఇచ్చారు, కానీ ప్రభుత్వం చేపట్టిన తర్వాత జిఓ 9 తీసుకువచ్చి దానినీ రద్దు చేసి జిఓ 46 తీసుకువచ్చి ఎన్నికలు నిర్వహించడం బీసీలకు నమ్మక ద్రోహం చేయడమేనని అన్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయని పక్షంలో బీసీలు అందరూ ఏకమై కాంగ్రెస్ పార్టీ కి వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మంద వెంకన్న, జిల్లా కార్యదర్శి ఎన్నం వామన్, ప్రచార కార్యదర్శి పర్వతం మల్లేశం, యువజన సంఘం అధ్యక్షుడు మదాసు సంజీవ్, బీసీ సంఘాల నాయకులు తిలన్ గౌడ్, వెంకటేష్, మారుతి, శ్రీనివాస్, మాధవ్, రాజారాం యాదవ్, పురుషోత్తం, ఆశిష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.