27-11-2025 12:02:45 AM
మేడ్చల్ అర్బన్ నవంబర్ 26 (విజయక్రాంతి): 69వ ఎస్ జి ఎఫ్ తెలంగాణ రాష్ట్ర స్థాయి కరాటే సేలెక్షన్‌లు 24, 25, 26 తేదీలలో వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరిగాయని టీం కోచ్ జి అక్షయ మున్నా కుమార్ తెలిపారు. యూనివర్సల్ 369 మార్షల్ ఆర్ట్స్ అకాడమీ స్టూడెంట్ పి. చైతన్య అండర్ 14లో మైనస్ 35 వెయిట్ కేటగిరీలో బంగారు పతకం సాధించారని తెలిపారు.
డిసెంబర్ రెండవ వారంలో మధ్యప్రదేశ్ ఇండోర్‌లో జరగబోయే అంతర్జాతీయ పోటీలకు విద్యార్థిని చైతన్యను తెలంగాణ రాష్ట్రం తరఫున ఆడటం జరుగుతుందన్నారు. మేడ్చల్ జిల్లా తరఫున కరాటే పోటీలలో పాల్గొని జాతీయ స్థాయి పోటీలకు సెలక్షన్ అయినందుకు టీం కోచ్ జి. అక్షయ మున్నా కుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వీరభద్ర సింగ్, వరుణ్ తేజ్, సీనియర్ కరాటే మాస్టర్ చందర్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.