27-11-2025 05:52:53 PM
29న "దీక్షా దివస్" కు వేలాదిగా తరలిరావాలి: ఒంటెద్దు నర్సింహారెడ్డి
మఠంపల్లి: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఇరుగు పిచ్చయ్య అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ మండల పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, హుజూర్నగర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఒంటెద్దు నరసింహారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ దీక్షా దివస్ ప్రత్యేక తెలంగాణ కోసం కేసీఆర్ చచ్చుడో - తెలంగాణ వచ్చుడో' అన్న నినాదంతో 2009 నవంబరు 29న కేసీఆర్ ఆమరణ దీక్ష చేపట్టారు. అదే తెలంగాణ ఏర్పాటుకు కీలకమలుపు అని ఆరు దశాబ్దాల స్వప్నమైన తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం తొలిసారి అధికారికంగా ప్రకటించింది.
మహాత్మాగాంధీ చూపిన అహింసా మార్గంలో ఉద్యమాన్ని నడిపి చివరకు ఆమరణ దీక్షనే అస్త్రంగా సంధించిన కేసీఆర్ త్యాగఫలమే నేటి తెలంగాణ. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఏప్రిల్ 27, 2001న గులాబీ జెండాను ఎగరవేసిన నాయకులు కేసీఆర్. తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని మలుపు తిప్పి, ఉద్యమ చరిత్రపై చెరిగిపోని సంతకం చేసిన మహానాయకులు కేసీఆర్ అని ఆయన అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ గ్రామాన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు శక్తి వంచన లేకుండా కష్టపడి పనిచేసి మన పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని భారీ మెజారిటీతో గెలిపించి పార్టీ సత్తా చాటాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సీనియర్ నాయకులు డాక్టర్ కె.ఎల్.ఎన్.రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ మన్నెం శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి బానోతు జగన్ నాయక్, మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామాల పార్టీ అధ్యక్షులు,మహిళా నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.