27-11-2025 05:44:01 PM
మోతే (విజయక్రాంతి): మండల పరిధిలోని రావి పహడ్ గ్రామానికి చెందిన సోమగాని సోమేశ్ గౌడ్ బీజేపీ పార్టీకి రాజీనామా చేసి గురువారం బీఆర్ఎస్ పార్టీలో కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో చేరినట్లు తెలిపారు. అనంతరం సోమేశ్ గౌడ్ మాట్లాడుతు పార్టీ నిర్ణయం మేరకు నాకు అప్పగించిన పనిని క్రమ శిక్షణతో పని చేసి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు ఉపేందర్ గౌడ్, కాకి సురేందర్ రెడ్డి, బిక్షం, శ్రీను, సత్యం, ప్రభంజన్, ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.