27-11-2025 05:46:06 PM
పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు
పాపన్నపేట (విజయక్రాంతి): మండల కేంద్రం పాపన్నపేటలోని సాయిబాబా ఆలయం 16వ వార్షికోత్సవాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. వేకువజాము నుంచే ఆలయ అర్చకులు విశ్వనాథ శర్మ, నవీన్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 108 లీటర్ల పాలతో సాయిబాబాకు ఘనంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం పట్టు వస్త్రాలతో సాయిబాబాను సుందరంగా అలంకరించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.
గ్రామానికి చెందిన రామారపు వీరేశం మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం సాయిబాబాను పల్లకిలో ఉంచి గ్రామపురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ కమిటీ సభ్యులు రవీందర్ గౌడ్, చీనూరి రాములు, ఉప్పరి వెంకటేశం, బీకొండ రాములు, నీటలాక్షప్ప, నాయకులు ఆకుల శ్రీనివాస్, రంగంపేట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.