27-11-2025 05:59:49 PM
కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షురాలిగా తోట దేవి ప్రసన్న నియమితులైన సందర్భంగా గురువారం కొత్తగూడెం విద్యానగర్ కాలనీలోని రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయం టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ గద్దల రమేష్ మర్యాదపూర్వకంగా కలుసి పుష్పగుచ్చం అందించి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గద్దల రమేష్ మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందన్నారు.
అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు అధికారం లేకపోయినా పార్టీ కోసం అహర్నిశక్తులుగా పనిచేసిన తోట దేవి ప్రసన్నకు డీసీసీ దక్కిన గౌరవమన్నారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పని చేసిన వారికి ఎప్పటికైనా న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రెసిడెంట్, చీకటి కార్తీక్, సుజాతనగర్ మండల అధ్యక్షులు, చింతలపూడి శేఖర్, గులం మతిన్, రామ్మూర్తి, అశోక్, సదా, శ్రీకాంత్ పాల్గొన్నారు.