23 June, 2026 | 8:40 PM

Breaking News

చర్ల రైతు వేదికలో ఘనంగా విత్తన మేళా   •   ఎన్నికల సంఘం ఆదేశానుసారంగా హెల్ప్ డెస్క్ ప్రారంభం   •   కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే బర్తరఫ్ చేయాలి   •   బోధన్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంప్   •   ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి   •   పాఠ్యపుస్తకాల పేరిట దోపిడీని అరికట్టాలి: ఏఐవైఎఫ్ హెచ్చరిక   •   నెల రోజులు ఇంటింటి సర్వే...   •   రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు వెంటనే జమ చేయాలి   •   కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం   •   ఫాదర్ అమల్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం   •  

కుక్క పిల్లను ఎత్తుకొని తిరుగుతున్న వానరం

30-09-2025 08:18 AM

జయశంకర్ భూపాలపల్లి జిల్లా తిరుమలగిరిలో ఘటన

రేగొండ,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని(Regonda Mandal) తిరుమలగిరి గ్రామంలో వింతఘటన మంగళవారం జరిగింది. ఓ వానరం అప్పుడే పుట్టిన చిన్న కుక్క పిల్లను ఎత్తుకొని చెట్లపై తిరుగుతుంది. స్థానికులు ఎంత ప్రయత్నించినా కుక్క పిల్లను విడవకుండా కింద పడకుండా గట్టిగా పట్టుకుని ఓ చెట్టు పైనుండి మరో చెట్టు పైకి దూకుతూ స్థానికుల పైకి దాడి చేయడానికి ప్రయత్నిస్తుందే తప్ప కుక్క పిల్లను మాత్రం విడవడం లేదు. పాపం తల్లి కుక్క ఆ వానరం వెనకాలే పరిగెడుతుంది. కానీ ఆ వానరం మాత్రం జాలి దయ లేకుండా ఆ కుక్క పిల్లను తన పొట్టకు గట్టిగా హత్తుకొని అక్కడినుండి వెళ్ళిపోయింది.