30-09-2025 09:36:29 AM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా(Peddapalli district) సుల్తానాబాద్ మండలం సుద్దాల గోదాముల సమీపంలో మంగళవారం తెల్లవారుజామున రెండు ద్విచక్ర వాహనాలు డీకొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా ముత్యం రాకేష్ మృతి చెందాడు. ఉదరీ అభినవ్ కరీంనగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. పూదరి ఆదర్శ్, కసికంటి రఘు, ఇద్దరికీ తీవ్రగాయాలు కాగా కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.