30-09-2025 08:13:24 AM
అభివృద్ధి మా ప్రజా ప్రభుత్వ ధ్యేయం
ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోష్ నాయక్
నవాబ్ పేట్ : ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటా ఆనందాలు వెళ్ళు వేరుస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోష్ నాయక్ అన్నారు. మండల కాకర్జాల తండాలో ఇందిరమ్మ ఇండ్లను ప్రొసీడింగ్స్ అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కురిసిన భారీ వర్షానికి ఇల్లు కూలిపోవడం జరిగిందన్నారు. గత కొన్ని రోజుల క్రితం ఇల్లు కూలిపోయిందని తమ దృష్టికి తీసుకురావడం జరిగిందని, తెలుపగా ఆ విషయాన్ని ఎమ్మెల్యే(MLA Anirudh Reddy) దృష్టికి తీసుకుపోయిన వెంటనే ఇల్లును మంజూరు చేసి వారి అభివృద్ధికి కృషి చేసినందుకు ఎమ్మెల్యేకు సంతోష్ నాయక్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నిరుపేదలకు అండగా నిలుస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల మార్కెట్ కమిటీ చైర్మన్ హరలింగం, దేపల్లీ వెంకటేశ్ గౌడ్ గారు,మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు భాస్కర్ నాయక్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు మూడావత్ లక్ష్మణ్ నాయక్,మాజీ సర్పంచ్ బుడ్డు నాయక్, సిద్దోటం వెంకటేశ్, నెత్తికొప్పుల శంకర్,గోవింద్ నాయక్, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.