calender_icon.png 17 July, 2025 | 9:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోతికి ఘనంగా అంతక్రియలు

16-07-2025 11:57:42 PM

గంగోరి గూడెంలో మానవత్వం చాటుకున్న గ్రామస్తులు

మునుగోడు,(విజయక్రాంతి): ప్రస్తుతం బంధువుల్లో ఎవరు ఏం అవుతారో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఇలాంటి బిజీ లైఫ్​లో కొంతమంది జంతువుల పట్ల సానుభూతి, ప్రేమ చూపిస్తుంటే ఇప్పటికీ మానవత్వం, ప్రేమానురాగాలు బతికే ఉన్నాయని అనిపిస్తోంది. కనీసం రోడ్డు ప్రమాదంలో ఎవరైనా గాయపడినా, చనిపోయినా మనకెందుకులేనని వెళ్లిపోయే ఈ రోజుల్లో ఓ వానరానికి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సంఘటన బుధవారం మండలంలోని గంగోరిగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు మృతి చెందిన కోతికి గ్రామ మాజీ సర్పంచ్ పానుగంటి పారిజాత నరసింహ గౌడ్ పెద్దలతో చర్చించి సాంప్రదాయ బద్ధకంగా పూలమాలవేసి గ్రామ వీధుల్లో మేళ తాళాలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామం పెద్దలు స్థానికులు ఉన్నారు.