calender_icon.png 18 July, 2025 | 9:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సంక్షేమం దిశగా ప్రభుత్వ విధానాలు

17-07-2025 12:00:00 AM

మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ

మనకొండూరు, జూలై 16 (విజయ క్రాంతి): ప్రజా సంక్షేమం దిశగా కాంగ్రెస్ ప్రభుత్వ విధానా లు సాగుతున్నాయని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. బుధవారం ఎల్‌ఎండీ కాలనీలోని ప్ర జాభవన్లో నిర్వహించిన కార్యక్రమంలో నూతనంగా పార్టీలో చేరి న నేతలకు కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విధానాలు, ప్రగతిశీల పాలన ప్రజల్ని ఆకట్టుకుంటున్నాయని అ న్నారు.

పార్టీ బలోపేతానికి ఎవరు కష్టపడి పనిచేస్తారో వారికి తగిన గౌరవం లభిస్తుందన్నారు. పార్టీ అంతర్గత వ్యవహారాలను నేరుగా తన దృష్టికి తీసుకురావాలని, బహిరంగ వేదికలపై మా ట్లాడవద్దని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, పాశం రాజేందర్ రెడ్డి, ఊట్కూరి వెంకటరమణారెడ్డి, గుడిసె అయిలయ్య యాదవ్, ఐరెడ్డి మహేందర్ రెడ్డి, జ్యోతి, ఎలగందుల ప్రసాద్, పసుల వెంకటి, చిట్టి ఆనంద్ రెడ్డి, ఆకుల సత్యం, యాదవ రెడ్డి, తీగల పుష్పలత, కె. మల్లేశం తదితరులుపాల్గొన్నారు.