calender_icon.png 18 July, 2025 | 8:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పదవులు, పార్టీ పదవుల్లో నియామకాలు చేపట్టి అందరికీ న్యాయం చేస్తాం

17-07-2025 12:00:00 AM

కరీంనగర్, జూలై 16 (విజయ క్రాంతి): ప్రభుత్వ పదవులు, పార్టీ పదవుల్లో నియామకాలు చేపట్టి అందరికి న్యాయం చేస్తామని జిల్లా ఇంచార్జి, ఎ మ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. బు ధవారం కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ సం స్థాగత పునర్నిర్మాణం సన్నాహాక సమావేశాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాన కొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించారు.

ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ కార్యకర్తలు మొక్కవోని దీక్షతో పనిచేస్తే పదవులు వచ్చాయని, ప్రభుత్వం ఏర్పాటయిందన్నారు. పార్టీలో గత మూడు సంవత్సరాల నుంచి నిబద్ధతతో పనిచేస్తున్న వారిని కులాల వారీగా గుర్తించి నియామకం చేపట్టాలన్నారు. మిమ్మల్ని నా యకులను చెప్పినవారిని మర్చిపోకుండా వారిని నాయకులను చేసే వరకు విశ్రమించవద్దని రా హుల్గాంధీ చెప్పారని అన్నారు.

సమన్వకర్తలు ఇచ్చిన అందరి జాబితా నా దగ్గరకు చేరిందని, అందరికీ న్యాయం చేస్తామన్నారు. సభ్యత్వం విషయంలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్ కావాలన్నారు. దేవుళ్లు, దేవతల పేర్లమీద ప్రాజెక్టులు నిర్మించి బీఆర్‌ఎస్ పార్టీవారు లక్ష కోట్లు దండుకున్నారని విమర్శించారు. ఎక్కడైనా ప్రాజెక్టు మీద కట్టి కిందకు నీరు పారిస్తారని, కేసీఆర్ కింద ప్రాజెక్టు కట్టి పైకి నీరు పారిస్తామని చెప్పి కిందమీద చేశాడని అన్నారు.

నమ్మిన తెలంగాణను నిండా ముంచిన కేసీఆర్ను పాతాళంలోకి తొక్కింది కాంగ్రెస్ కార్యకర్తలేనని అన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, శాసనస భ్యులు మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, రుద్ర సంతోష్, సత్తు మల్లేశం, రహమతు హుస్సేన్, వైద్యుల అంజన్ కుమార్, వెలిచాల రాజేందర్రావు, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, ఒడితల ప్రణవ్, ఊట్కూరు నరేందర్ రెడ్డి,  కార్యకర్తలుపాల్గొన్నారు