3 June, 2026 | 1:01 AM

సైబరాబాద్‌లో వర్షాకాలం సన్నాహాలు

03-06-2026 12:19 AM

ముంపు ప్రాంతాలను సంయుక్తంగా పరిశీలించిన అధికారులు

శేరిలింగంపల్లి,జూన్ 2(విజయక్రాంతి): రానున్న వర్షాకాలంలో ముంపు సమస్యలను అడ్డుకోవడానికి సిఎంసి కమిషనర్ డాక్టర్ జీ. శ్రీజన (ఐఏఎస్), సైబరాబాద్ సిపి డాక్టర్ ఎం.రమేష్(ఐపీఎస్) సంయుక్తంగా కీలక పర్యటన చేపట్టారు.ఖాజాగూడ చెరువు,మల్కం చెరువు, కొండాపూర్,గచ్చిబౌలి, హెచ్ సియు ప్రాంతాలతో సహా ముంపు బాధిత ప్రాంతాలను సందర్శించి సమీక్షించారు.

డ్రైనేజీ లైన్ల శుభ్రత, చెరువుల సెడిమెంట్ తొలగింపు, మురుగునీటి వ్యవస్థ మెరుగుదల,కొత్త పంప్ సెట్ల ఏర్పాటు వంటి పనులు వేగంగా జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బం ది లేకుండా వర్షాకాలం సాఫీగా సాగేలా అన్ని చర్యలు తీసుకుంటమని అధికారులు పేర్కొన్నారు. ప్రజలు డ్రైనేజీల్లో చెత్త వేయకుండా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ డ్రైవ్ లో అన్ని శాఖల సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.