రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజే నిరసనలు
మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట వెన్నెల నగర్ వాసుల ధర్నా
భద్రాద్రి కొత్తగూడెం, జాన్ 2, (విజయక్రాంతి): తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఇందిరమ్మ రెండో విడత ఇండ్ల మంజూరు ప్రారంభోత్సవాల నాడే వెన్నెల నగర్ లబ్ధిదారులు కార్పొరేషన్ కార్యాలయం ముందు మంగళవారం నిరసన ధర్నా నిర్వహించారు. వెన్నెల నగర్ 75 గజాల ప్రభుత్వ స్థల లబ్ధిదారులకు రెండో విడతలో ప్రాధాన్యత ఇవ్వాలనీ , పెండింగ్లో ఉన్న 600 మందికి రెండో విడతలో ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు మంజూరు చేయాలనీ ,వెన్నెల నగర్ ఇండ్లు మంజూరు చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని సేవ్ కొత్తగూడెం సేవ్ కార్పొరేషన్ కన్వీనర్ జలాల్, పట్టణ కార్యదర్శి ఆవాజ్ లు హెచ్చరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు ఎండిస్తామని ఇది నిరంతరం ప్రక్రియ అని చెప్తుంది తప్ప ఆచరణలో 10 ,12, 20, ఇల్లు డివిజన్లో వారీగా నామమాత్రం కేటాయిస్తూ అర్హులకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంగరంగ వైభవంగా ప్రారంభిస్తున్న పథకం మాటలకు చేతలకు అనేక తేడాలు ఉంటున్నాయని విమర్శించారు. వెన్నెల నగర్ లో పెండింగ్ లో ఉన్న 600 మందికి రెండో విడతలో ప్రధమ ప్రాధాన్యత ఇచ్చి ఐదు లక్షల మంజూరు చేయాలని కోరారు. లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఆయన హెచ్చరించారు.






