వర్షాకాలం అప్రమత్తత అవసరం
- అధికారులకు కలెక్టర్ ఆదేశం
ఆదిలాబాద్, జూన్13 (విజయక్రాంతి): వరాకాలం ప్రారంభమైనందున అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజరిషా వైద్యాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం పలు శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. వరాకాలం ప్రారంభమైనందున శిథిలమైన, కూలిపోయే స్థితిలో ఉన్న వాటిని గుర్తించి వెంటనే కూల్చి వెయ్యాలని, లోతట్టు ప్రాంతాలను గుర్తించి వరదల తాటికి నివాస గృహాలు మునిగిపోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పరిసరాల పరిశుభ్రత, జాగ్రత్తలు పాటించేలా గ్రామాల్లో వైద్యాధికారులు అవగాహన కల్పించాలని సూచించారు.
తాగునీరు కలుషితం కాకుండా చూసుకోవాలని, లీకేజీలను గుర్తించి మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ట్రైబల్ స్కూల్స్, కేజీబీవీలను ప్రతీరోజూ సందరించి విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మంగళవారం, శుక్రవారాల్లో డ్రై డేను నిరహించాలన్నారు. ఆర్బీస్‌కే బృందాలు జిల్లాలో 8 ఉన్నాయని చెప్పారు. శ్యామ్ మామ్ పిల్లలను గుర్తించి సరైన పోషకాహారం అందించి ఎదుగుదల సరిగ్గా ఉండేలా చూడాలని ఆదేశించారు. సాధారణ ప్రసవాలు ప్రభుత ఆసుపత్రి లో జరిగేలా చూడాలన్నారు.






