మూసీ బ్రిడ్జీకి మరమ్మతులు చేయాలి
10-06-2024 01:23 AM
ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి
యాదాద్రి భువనగిరి, జూన్ 9 (విజయక్రాంతి): భువనగిరి చిట్యాల ప్రధాన మార్గంలోని వలిగొండ వద్ద మూసీ బ్రిడ్జీకి వెంటనే మరమ్మతులు చేయాలని యాదా ద్రి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. ఆదివారం ఆయన ఆర్‌అండ్‌బీ అధికారులతో కలిసి వలిగొండ, బీబీ నగర్ మండలాల్లోని మూసీ బ్రిడ్జిలను పరిశీలించారు. దశాబ్దం నుంచి రహదారులు, బ్రిడ్జీల నిర్వహణకు నిధులు కేటాయించకపోవడంతో అవి శిథిలావస్థకు చేరాయ న్నారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఈ మార్గంలో నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.






