15 April, 2026 | 3:16 AM

నైతిక విజయం మనదే

27-02-2026 12:00 AM

ప్రజల పక్షాన నిలబడండి : మాజీ ఎంపీ మాలోత్ కవిత 

కేసముద్రం, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార పార్టీ విజయం సాధించేందుకు ఎన్నో ఎత్తులు వేసినా వాటిని తట్టుకొని నిలబడి, కేసముద్రం మున్సిపాలిటీలో 16 వార్డు కౌన్సిలర్ పదవుల్లో ఎనిమిదింటిని కైవసం చేసుకుని నైతిక విజయం సాధించామని, ఎంపీ ఎక్స్ అఫీషియో ఓటు తో కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టిందని, అధైర్య పడకుండా ప్రజల పక్షాన నిలబడి పనిచేయాలని  బీ ఆర్ ఎస్ కౌన్సిలర్లకు ఆ పార్టీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మాలోత్ కవిత సూచించారు. ఇటీవల మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయం సాధించిన కేసముద్రం మున్సిపల్ బీ ఆర్ ఎస్ కౌన్సిలర్లు ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కవిత, బీఆర్‌ఎస్ నాయకురాలు హరిత కౌన్సిలర్లకు కొత్త బట్టలు పెట్టి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.