24 July, 2026 | 1:55 AM

కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి మరింత కృషి చేయాలి

24-07-2026 12:00 AM

ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందాలు

రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్ గౌడ్

పూలపల్లి కృష్ణారెడ్డిని సన్మానించిన ఎమ్మెల్యే

రాజేంద్రనగర్ జూలై 23 (విజయక్రాంతి): రాజేంద్రనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి మరింతగా కృషి చేయాలని ఆ పార్టీ నాయకులు కార్యకర్తల కు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ సూచించారు. 123వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నియమితులైన పూలపల్లి కృష్ణారెడ్డి గురువారం ఎమ్మెల్యే నివాసంలో ఆయనను  కలుసుకున్నారు.

ఈ సందర్భంగా కృష్ణారెడ్డి ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యకర్తలను అందరిని కూడా కలుపుకొని పోతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను పేదలందరికీ చేర్చే విధంగా కృషి చేయాలని కృష్ణారెడ్డికి ఎమ్మెల్యే సూచించారు. అనంతరం కృష్ణారెడ్డిని ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో నార్సింగి మార్కెట్ కమిటీ డైరెక్టర్ తలారి ప్రేమ్ కుమార్, ఏ-బ్లాక్ అధ్యక్షుడు డప్పు నవీన్, కాంగ్రెస్ నాయకులు భోగాల శ్రీనివాస్, అంకం శ్రీనివాస్, లక్ష్మణ్, శ్రీనివాస్ ముదిరాజ్, సుధాకర్, విష్ణు, మాదరవల్లి, వినయ్, శివ తదితరులు పాల్గొన్నారు.