31-12-2025 01:28:45 AM
ములకలపల్లి, డిసెంబర్ 30 (విజయక్రాంతి): ప్రభుత్వ విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఎస్‌ఎఫ్‌ఐ 56 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళవారం ఎస్‌ఎఫ్‌ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల,జగన్నాథపురం ప్రభుత్వ పాఠశాలల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ మండల నాయకులు ముదిగొండ ప్రశాంత్ పాల్గొని మాట్లాడారు.దేశంలో 1970 డి సెంబర్ 30న కేరళ రాష్ట్రంలోని త్రివేండ్రం పట్టణంలో స్వాతంత్రం, ప్రజాస్వామ్యం, సోషలి జం,అనే నినాదంతో ఎస్‌ఎఫ్‌ఐ ఆవిర్భవించిందని తెలిపారు.ఎస్‌ఎఫ్‌ఐ ఆవిర్భవించిన నాటి నుండి దేశంలో అనేక విద్యారంగ సమస్యల పరిష్కారానికి బాటలు వేసిందని తెలిపారు.
ఎస్‌ఎఫ్‌ఐ నిర్వహించిన అనేక పోరాటాల ఫలితంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగొచ్చి విద్యారంగ స మస్యల పరిష్కారానికి ప్రయత్నించాయని అటువంటి చరిత్ర ఎస్‌ఎఫ్‌ఐ కి ఉందన్నారు. ఏబీవీపీ ఇతర విద్యార్థి సంఘాల దాడులను సమర్థవంతంగా ఎదుర్కొంటూ దేశంలో అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఎదిగిందని గుర్తు చేశారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో విఫలం అయ్యాయని విమర్శించారు. ప్రైవేట్ విద్యా రంగ సంస్థల దోపిడిని అ రికట్టాలని డిమాండ్ చేశారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ విద్యా రంగ సంస్థలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ విద్యారంగ సంస్థలను వెనక్కి నెడుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ వి ద్యాసంస్థలకు అధికంగా నిధులు కేటాయించి ప్రభుత్వ విద్యారంగా సంస్థలను అభివృద్ధి పరచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నేటికీ కీలకమైన శాఖ విద్యాశాఖకు మంత్రి లేకపోవడం వి చారకరమన్నారు. తక్షణమే విద్యాశాఖకు మంత్రిని కేటాయించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో చందు, నాగచైతన్య, సాంబ, సంజయ్, అభి, కావ్య, లావణ్య, ప్రియ, శివ, సందీప్, దీక్షిత్, యోదా, లక్ష్మణ్, మణికంఠ, తదితరులు పాల్గొన్నారు.