21-11-2025 11:27:28 PM
ప్రిన్సిపల్ సీతారాంబాబు
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి, నిజామాబాద్ ఉమ్మడి జిల్లా లోని విద్యార్థులు ఆరవ తరగతిలో ప్రవేశం కొరకు అడ్మిట్ కార్డు పొందవచ్చని నవోదయ పాఠశాల ప్రిన్సిపల్ సీతారాం బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పి.యం. జవహార్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశం కొరకు 13 డిసెంబర్ 2025న నిర్వహించే పరీక్షల అడ్మిట్ కార్డును ఆన్లైన్లో వెబ్సైట్ ద్వారా పొందవచ్చు అన్నారు. www.navodaya.gov.in website ద్వారా అడ్మిట్ కార్డు పొందవచ్చని నవోదయ పాఠశాల ప్రిన్సిపాల్ ఎం. సీతారామ్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు.