05-08-2025 01:29:29 AM
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
- రష్యాతో వ్యాపారం చేయడమే కారణమని వ్యాఖ్య
వాషింగ్టన్, ఆగస్టు 4: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై మరోసారి తన అక్కసును వెళ్లగక్కారు. ఇటీవల భారత్‌పై 25 శాతం ప్రతీకార సుంకం విధిస్తున్న ట్టు ప్రకటించిన ట్రంప్ తాజాగా మరిన్ని సుంకాలు విధిస్తానని హెచ్చరించారు. ట్రంప్ తన సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఒక ప్రకటన విడుదల చేశారు.
రష్యా నుంచి భారత్ భారీగా చమురు కొనుగోలు చేస్తుందని.. ఆ చమురును పెద్ద మొత్తంలో విక్రయిస్తోందన్నారు. బహిరంగ మార్కెట్‌లో చమురు విక్రయించి భారత్ లాభం పొందుతుందని అసహనం వ్యక్తం చేశారు. భారత్ పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేయ డం వల్ల రష్యాకు భారీగా ఆర్థిక వనరులు చేకూరుతున్నాయని, అందుకే ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపడం లేదని విమర్శించారు. భారత్‌పై విధించిన 25 శాతం సుంకాలు, అద నపు పెనాల్టీ ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చి న సంగతి తెలిసిందే.