calender_icon.png 5 August, 2025 | 10:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజమైన భారతీయులెవరూ అలా మాట్లాడరు..

05-08-2025 01:32:02 AM

- రాహుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

- పరువునష్టం కేసు విచారణపై స్టే విధించిన ఉన్నత న్యాయస్థానం

-  కేంద్రం ‘డీడీఎల్‌జే’ పాలసీ అనుసరిస్తోంది: జైరాం రమేష్

న్యూఢిల్లీ, ఆగస్టు 4: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చైనా ‘ఆక్రమణలు’ అంటూ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్య క్తం చేసింది. ‘భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందనే విషయం మీకెలా తెలుసు? నిజమైన భారతీయులెవరూ ఇలాంటి వ్యా ఖ్యలు చేయరు. ప్రతిపక్ష నేత హోదాలో ఉం డి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు.’ అని సుప్రీం వ్యాఖ్యానించింది. 2022లో నిర్వహించిన భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘మ న దేశానికి చెందిన రెండు వేల చదరపు కిలోమీటర్లకు పైగా భూభాగాన్ని చైనా ఆక్రమిం చింది.

గల్వాన్ లోయలో చైనా సైనికులతో ఘర్షణ అనంతరం మోదీ ప్రభుత్వం చైనాకు లొంగిపోయింది’ అని ఆరోపించారు. మనదేశ ఆర్మీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని ఉదయ్ శంకర్ అనే మాజీ సైనికాధికారి ల క్నో కోర్టులో పరువునష్టం కేసు దాఖలు చే శారు. ఈ కేసు విచారణపై స్టే విధించాలని రాహుల్ గాంధీ గతంలో అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించగా.. అలహాబాద్ హైకోర్టు రాహుల్ పిటిషన్‌ను తిరస్కరించింది. కాగా.. రాహుల్‌గాంధీ అనంతరం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో సోమవారం జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఏసీ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను విచారించి.. రాహుల్‌కు పలు ప్రశ్నలు సంధించింది. 

సింఘ్వీనీ మందలించిన న్యాయస్థానం

రాహుల్‌గాంధీ తరఫున న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. ‘రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు.. దేశంలో ఉన్న సమస్యలను ఆయన  ప్రశ్నించకపోతే మరెవరు ప్రశ్నిస్తారు’ అని వాదించగా.. జస్టి స్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టున్ జార్జ్ మా సిహ్‌లతో కూడిన ధర్మాసనం సింఘ్వీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటువంటి సమస్యలు ఏవైనా ఉంటే పార్లమెంట్‌లో ప్రశ్నిం చాలని సోషల్ మీడియాలో కాదని హితవు పలికింది. కోర్టు ఈ కేసులో విచారణపై స్టేవిధిస్తూ సుప్రీం నిర్ణయం తీసుకున్నప్పటికీ, రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసింది. 

మోదీ ప్రభుత్వానిది ‘డీడీఎల్‌జే’ పాలసీ

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గత ఐదేళ్లుగా ‘డీడీఎల్‌జే’ పాలసీ అనుసరిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ.. ‘గల్వాన్ లోయలో మనసైనికులు వీరోచితంగా పోరాడిన ప్రాణాలు త్యాగం చేసిన తర్వాత ప్రధాని మన భూభాగంలోకి ఎవరూ చొరబడలేదని చైనా ఎందుకు క్లీన్ చిట్ ఇచ్చారు?. అయిదేళ్లుగా మోదీ ప్రభుత్వం ‘తిరస్కరించు (డినే), దృష్టి మరల్చు (డిస్‌ట్రాక్ట్), అబద్ధం చెప్పు (లై), సమర్థించు (జస్టిఫై) అనే విదానాలను అనుసరిస్తోంది. జవాబుదారీతనం నుంచి ప్రభుత్వం తప్పించుకుంటోంది’ అని జైరాం రమేష్ కేంద్రంపై ధ్వజమెత్తారు.