calender_icon.png 7 August, 2025 | 6:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ ఎంపీ చైన్ కొట్టేసిన దొంగ

05-08-2025 01:26:14 AM

- సుధా రామకృష్ణన్ మెడలో గొలుసు చోరీ

- మార్నింగ్ వాక్ సమయంలో ఘటన

న్యూఢిల్లీ, ఆగస్టు 4: తమిళనాడు ఎంపీ సుధా రామకృష్ణన్ మెడలో గొలసును గుర్తుతెలియని దుండగులు లాక్కెళ్లారు. ఢిల్లీలో వాకింగ్ చేస్తున్న సమయంలో ఈ సంఘట న జరిగింది. అత్యంత భద్రత, విదేశీ రాయబారులు ఉన్న ప్రాంతానికి సమీపంలో చైన్ స్నాచింగ్ జరగడం గమనార్హం.

దీంతో సు ధా రామకృష్ణన్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఢిల్లీ చాణక్యపురిలోని పో లండ్ రాయబార కార్యాలయం సమీపంలో తన తోటి ఎంపీ, డీఎంకే సభ్యురాలు రాజతి తో కలిసి మార్నింగ్ వాక్ చేస్తున్న సమయం లో ఈ చోరీ జరిగింది. ఘటనపై  హోంమం త్రి అమిత్ షాకు లేఖ రాశారు. స్కూటర్‌పై హెల్మెట్ ధరించిన వ్యక్తి తన గొలుసు లాక్కెళ్లినట్టు అందులో పేర్కొన్నారు.