ముగ్గురు కూతుళ్లతో చెరువులో దూకిన తల్లి
- తల్లి, చిన్న కూతురు మృతి
ఇద్దరిని రక్షించిన స్థానికులు
అనుమానపు భర్త వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం
మేడ్చల్, మే 15 (విజయక్రాంతి): కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురై న తల్లి ముగ్గురు కూతుళ్లతో చెరువులో దూ కిన ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. ఈ ఘటనలో తల్లి, చిన్న కూతురు మృతిచెందగా, మరో ఇద్దరిని స్థానికులు రక్షించారు. మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకల్ మండలం కన్ననూ రు గ్రామానికి చెందిన లోకమాన్య నాగరాజ్ (35), సుజాత (32) ప్రేమ వివా హం చేసుకున్నారు.
మేడిపల్లి మండలం నారపల్లి మహాలక్ష్మిపురం కాలనీలో నివాసమంటున్నారు. వీరికి ముగ్గురు కూతు ళ్లు. అక్షిత (13) ఎనిమిదవ తరగతి, ఉదయశ్రీ (11) ఆరవ తరగతి, వర్షిని (6) ఒకటో తరగతి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. నాగరాజు ఆటో నడుపుతుండగా, సుజాత చెరుకు రసం విక్రయి స్తూ జీవనం సాగిస్తున్నారు. సుజాతపై అనుమానం పెంచుకున నాగరాజ్ తర చూ ఆమెను వేధిస్తుండేవాడు.
ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో మనస్థాపానికి గురైన సుజాత ముగ్గురు కూతుళ్లతో గురువారం కలిసి చెరువులో దూకింది. స్థానికులు గమనించి అక్షిత, ఉదయశ్రీని రక్షించారు. సుజాత, చిన్న కూతురు వర్షిని చెరువులో మునిగి, చనిపోయారు. అక్షిత, ఉదయ్‌శ్రీని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు బంధువులు తెలిపారు. సుజాత బంధువుల ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.






