16-05-2025 01:09:01 AM
మంచికంటి కృష్ణమూర్తి నియామకం
యాదాద్రి భువనగిరి మే 15 (విజయక్రాంతి) : మహాలక్ష్మి ధర్మశాల నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం గురువారం నాడు ధర్మశాల ఆవరణలో అట్టహాసంగా జరి గింది. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పి ప్రమోద్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నూతన కమిటీ సభ్యుల చేత ఇండోమెంట్ జిల్లా అధికారి శ్రీమతి లక్ష్మి. ప్రమాణస్వీకారం చేయించారు.
అధ్యక్షులు మంచి కంటి కృష్ణ మూర్తి, సభ్యులు బేలీదే ఆనంద్, జాలూరు కృష్ణ మూర్తి, కుకడపు సంతోష్ కుమార్. రంగా పద్మావతిలు ప్రమాణ శ్రీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేస్తున్న ధర్మశాల నూతన కమిటీకి స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపినట్లు జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆవేజ్ చిస్తి తెలిపారు.
నూతన కమిటీ ఆధ్వర్యంలో ధర్మశాల అభివృద్ధి బాట పడుతుందని ఎమ్మెల్యే ఆశాభావాన్ని వ్యక్తం చేసినట్లు చిస్తి తెలిపారు. ఈ సందర్బంగా చైర్మన్ కృష్ణమూర్తిమాట్లాడుతు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, స్థానిక నాయకుల సహకారంతో , అందరి సలహాల సూచనలతో ధర్మ శాల అభివృద్ధి కి కృషి చేస్తా మనీ అన్నారు.
ఈ కార్యక్రమం లొ మున్సిపల్ మాజీ చైర్మన్ బర్రె జహంగీర్, సీనియర్ జర్నలిస్ట్ సొల్లేటి గోవర్ధనాచారి, ప్రముఖ వ్యాపారి దిడ్డికాడి నర్సింగరావు, పెట్రోల్ బంక్ యజమాని ఎర్రం శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కృష్ణ యాదవ్. కైరం కొండ వెంకటేష్. పడిగేలా ప్రదీప్. కొత్త నర్సింహా స్వామి. చల్లగురుల రఘుబాబు, రాచమల్ల రమేష్, బాలేశ్వర్, పిట్టల బాలరాజు, వెంకటేష్, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మార్త వెంకటేశ్వర్లు, మాజీ అధ్యక్షులు పసుపు నూరి నాగభూషణం, పసుపు నూరి మనోహర్, సోమేశ్వర్ గుప్తా, తదితరులు పాల్గొన్నారు