నాటి జ్ఞాపకాలు.. నేటి పలకరింపులు
16-05-2025 01:10 AM
25 సంవత్సరాల తర్వాత అపూర్వ కలయిక
హుజూర్ నగర్ , మే 15: 25 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులు అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. మేళ్లచెరువు మండల కేంద్రం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 2000-2001బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు గురువారం తమ పాఠశాలలో కలుసుకున్నారు.
ఆ నాటి జ్ఞాపకాలను,తోటి స్నేహితులతో అనుభవాలు గుర్తు చేసుకుని ఆప్యాయంగా పలకరించుకు న్నారు.నాటి గురువులను శాలువాలు,పుష్పగుచ్ఛాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పల్లేటి నాగార్జున, గణేష్,నాగేశ్వర్ రావు, వీరబాబు, సైదులు,రాధిక,పద్మ, శ్రీ లక్మీ,భవాని,లక్ష్మీ, పుష్ప లత, హైమావతి, సుల్తానా బేగం, చంద్ర కళ, విజయ కుమారి, ఉపాధ్యాయు లు పాల్గొన్నారు.






