15 April, 2026 | 12:01 PM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

అనురాగ్ విశ్వవిద్యాలయం, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌ల మధ్య ఎంఓయు

11-12-2025 12:00 AM

ఘట్ కేసర్, డిసెంబర్ 10 (విజయక్రాంతి) : వెంకటాపూర్ లోని అనురాగ్ విశ్వవిద్యాలయం, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ లు బుధవారం ఎంఓయు పై సంతకాలు చేశాయి. ఈ సంస్థల మధ్య అవగాహన పత్రం అనుసరించి అనురాగ్ విశ్వవిద్యాలయం విద్యార్థులు బీటెక్, ఎంటెక్, పీ.హెచ్.డీ, రీసెర్చ్ ప్రాజెకట్స్ ఎన్.ఆర్.ఎస్.సి నందు పూర్తి చేయవచ్చు. ఎన్‌ఆర్‌ఎస్సి, అనురాగ్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా పరిశోధనలు నిర్వహించవచ్చు.

అనురాగ్ విశ్వవిద్యాలయం విద్యార్థులు ఇండస్ట్రియల్ విజిట్, ట్రైనింగ్ ల కొరకు ఎన్ ఆర్ ఎస్ సి సహాయం కోరవచ్చును. ఈ అవగాహన పత్రంపై ఎన్ ఆర్ ఎస్ సి డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ చౌహాన్, అనురాగ్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ అర్చన మంత్రి సంతకాలు చేశారు.

ఈకార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎన్. అపర్ణ గ్రూప్ హెడ్, టీఈఓజి ఎన్‌ఆర్‌ఎస్సి, పి. శశిధర్ రెడ్డి, అనురాగ్ విశ్వవిద్యాలయ సీఈవో ఎస్ .నీలిమ, ఓఐఏ డైరెక్టర్ డాక్టర్ సిద్ధార్థ గోష్,  అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ ఎం. సంతోష్ పాల్గొన్నారు. ఈ ఎంఓయు జరుగుటకు ఎంతగానో సహకరించిన ఎన్‌ఆర్‌ఎస్సి శాస్త్రవేత్త డాక్టర్ జయసక్సేనాకు అనురాగ్ విశ్వవిద్యాలయ యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపారు.