అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభం
11-12-2025 12:00 AM
ప్రారంభించిన ఎమ్మెల్యే బిఎల్‌ఆర్
ఉప్పల్ డిసెంబర్ 10విజయక్రాంతి : ఉప్పల్ నియోజకవర్గంలోని మీర్పేట్ హె బి కాలనీ లో స్థానిక కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్‌తో కలిసి కోటి 38 లక్షల ఆరువేల అంచనా వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను ఉప్పల్ నియోజకవర్గ శాసనసభ్యులు బండారు లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలే పరిష్కరించడమే తమ ధ్యేయం అన్నారు.
డివిజన్లోని మౌలిక వసతులు పై ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేరుస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ గ్రేటర్ నాయకులు మాజీ కార్పొరేటర్ గూడారపు శ్రీనివాస్ రెడ్డి బోదాసు రవి కాప్రా సర్కిల్ అధికారులు పాల్గొన్నారు.






