2 July, 2026 | 1:33 AM

ఆధునిక పరిశోధనలకు ఎంవోయూ

02-07-2026 12:30 AM

జర్మనీ యూనివర్సిటీతో శాతవాహన వర్సిటీ ఒప్పందం

కరీంనగర్, జూలై 1 (విజయక్రాంతి): శాతవాహన విశ్వవిద్యాలయం జర్మనీకి చెందిన ప్రముఖ ‘ఓస్ట్ఫాలియా యూనివర్సిటీ ఆఫ్ అప్లుడ్ సెన్సైస్’తో బుధవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా ఉభయ విశ్వవిద్యాలయాల మధ్య అంతర్జాతీయ విద్యా సహకారం, విద్యార్థులు, అధ్యాపకుల మార్పిడి కార్యక్రమాలు, పరిశోధనలు, సాంకేతిక రంగాలలో పరస్పర సహకారం పెంపొందనున్నాయి.

శాతవాహన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య యు ఉమేష్ కుమార్  తన జర్మనీ పర్యటనలో ఈ అంతర్జాతీయ భాగస్వామ్యం సాధ్యపడింది. ఈ భాగస్వామ్యం ముఖ్యంగా పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణలు, అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలను పెంపొందించుకోవడంలో విద్యార్థులకు దోహదపడుతుంది.