18 July, 2026 | 3:31 AM

ఈవీఎంల మీద మాకు ఇప్పటికి నమ్మకంలేదు : అఖిలేశ్ యాదవ్

02-07-2024 12:29 PM

న్యూఢిల్లీ : ఈవీఎంల మీద తమకు ఇప్పటికి నమ్మకంలేదని, వాటిని తొలగించేవరకు తమ పోరాటం ఆగదని సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షులు, ఎంపీ అఖీలేశ్ యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై లోక్ సభలో మంగళవారం ఆయట మాట్లాడారు. ఇటీవల జరిగిన 2024 లోక్ సభ ఎన్నికల్లో  ఇండియా కూటమి నైతిక విజయాన్ని సాధించిందని, మతతత్వ రాజకీయాలు ఎన్నికల్లో ఓడిపోయాయని ఆయన పేర్కొన్నారు. బీజేపీ 400 సీట్ల అజెండా ఫెయిలైందని, మోదీ సర్కారు ఉద్యోగాలను ఇవ్వదలుచుకోలేదన్నారు. అందుకే పేపర్ లీకేజ్ లు అవుతున్నట్టు ఆయన ఆరోపించారు.