ఎన్డీయే పార్లమెంటరీ సమావేశం... ఎంపీలకు దిశానిర్దేశం
02-07-2024 11:28 AM
న్యూఢిల్లీ : ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశం పార్లమెంట్ లైబ్రరీ భవనంలో ప్రారంభమయింది. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి అయ్యాక మంగళవారం తొలిసారి భాగస్వామ్య పక్షాలతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, ఎన్డీయే ఎంపీలు పాల్గొన్నారు.
ఎంపీలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, విపక్షాల దాడి నేపథ్యంలో ఏన్డీయే కూటమి ఎంపీలకు మోదీ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. పార్లమెంట్ సమావేశాలకు ఎంపీలంతా కచ్చితంగా హాజరు కావాలని, దేశసేవ ప్రథమ కర్తవ్యమని ఆయన సూచించారు.






