calender_icon.png 27 July, 2025 | 6:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్లేపల్లి నర్సరీను పరిశీలించి మొక్కలు నాటిన ఎంపీడీవో సత్తయ్య

26-07-2025 08:13:10 PM

కొండాపూర్: కొండాపూర్ మండల పరిధిలోని మల్లెపల్లి గ్రామంలో శనివారం హరితహారం నర్సరీని సందర్శించి కమ్యూనిటీ స్థలంలో పెట్టిన మొక్కలను చూసి ఎంపీడీవో సత్తయ్య(MPDO Sathaiah) మరికొన్ని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హరితహారానికి మొక్కలు సిద్ధం చేయాలని అన్నారు. ఈత మొక్కలు అద్భుతంగా పెంచినందుకు పంచాయతీ కార్యదర్శికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ శ్రీనివాస్, ఏపీవో వీరప్ప, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ కూలీలు ఉన్నారు.