251 ఎంపీలపె క్రిమినల్ కేసులు
46 మంది ఎంపీలపై కేసులున్నట్టు వెల్లడి
దోషులుగా తేలిన 27 మంది ఎంపీలు
న్యూఢిల్లీ, జూన్ 7: సార్వత్రిక ఎన్నికల్లో పలు పార్టీల నుంచి పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించేందుకు ఎన్నికయ్యారు. మరి వారిలో చాలామందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇదే విషయాన్ని ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తమ అఫిడవిట్లలో పొందుపరిచారు. వివరాలను అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) విశ్లేషించింది.
46 శాతం మందిపై కేసులు
18వ లోక్‌సభకు ఎంపికైన ఎంపీల్లో 251 మందిపై అంటే 46 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వారిలో 27 మం దిపై నేర నిరూపణ కూడా అయింది. మొద టి లోక్‌సభ నుంచి 17వ లోక్‌సభ వరకు చూసుకుంటే ఈ లోక్‌సభకు ఎన్నికైన వారి లో ఎక్కువ మందిపై క్రిమినల్ కేసులు ఉ న్నాయి. అంటే 18వ లోక్‌సభలోనే ఎక్కువ మందిపై కేసులు నమోదయ్యాయి.
2019 లో 233 మంది (43 శాతం)పై కేసు లు ఉం డగా, 2014లో 185 మంది (34 శాతం), 2009లో 162 మంది (30 శాతం), 2004లో 125 మంది (23 శాతం) మం దిపై కేసులు ఉన్నట్టు తమ అఫిడవిట్లలో పొందుపరిచారు. 18వ లోక్‌సభకు ఎన్నికైన వారిలో 170 మందిపై తీవ్ర నేరారోపణలు ఉన్నట్టు అఫిడవిట్లలో పేర్కొన్నారు. వీరిపై అత్యాచారం, హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, మహిళలపై నేరాలు వంటి కేసులు ఉన్నాయి. 27 మందిపై నేర నిరూపణ అయింది.






