01-07-2024 12:05:00 AM
తమిళ కథానాయకులు ఆర్య, గౌతమ్ కార్తీక్ ప్రధాన పాత్రధారులుగా మను ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియన్ మూవీ “మిస్టర్ ఎక్స్”. సీనియర్ నటుడు శరత్ కుమార్, నటి మంజు వారియర్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్.లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా చిత్రీకరణ పూర్తయింది. చివరి రోజుని సెలబ్రేట్ చేసుకున్న చిత్ర బృందం ఆ ఫొటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనున్న యాక్షన్ సన్నివేశాల్ని స్టంట్ సిల్వా నేతృత్వంలో భారతదేశం, ఉగాండా, అజర్‌బైజాన్, జార్జియా దేశాల్లో చిత్రీకరించారు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాకి సంగీతం: ధిబు నినాన్ థామస్, ఛాయాగ్రాహణం: తన్వీర్ మీర్.