calender_icon.png 12 November, 2025 | 3:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రియా ఆనంద పరవశం..

01-07-2024 12:05:00 AM

ఈ ఫొటోలో నాయికను గుర్తుపట్టారా..? తెలుగు మూలాలు గల ఈ భామ తెలుగు తెరపై కనపడి దశాబ్ద కాలం గడిచింది. రానా తొలి చిత్రమైన ‘లీడర్’ సినిమా ద్వారా ‘రత్న ప్రభ’గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సోయగాల ప్రభ, అటుపై ‘రామ రామ కృష్ణ కృష్ణ’, ‘కో అంటే కోటి’ వంటి చిత్రాల్లో నటించింది. అనంతరం శ్రీదేవి ప్రధాన పాత్రలో రూపొందిన ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ సినిమాతో హిందీ సినిమాల్లోనూ అడుగుపెట్టింది.

ప్రస్తుతం తమిళం, మలయాళ, కన్నడ చిత్రాలతో తన సినీ ప్రయాణం సాగిస్తోంది నాలుగు పదుల వయసుకు చేరువవుతున్న ఈ నటీమణి. ఇరవై రెండేళ్ళ వయసులో వెండితెరపైకి వచ్చి పదిహేనేళ్ళుగా పరిశ్రమలో రాణిస్తున్న ఈమె, ఆదివారం తిరుమల వెంకటేశుడిని దర్శించుకుంది. స్వామి వారి సేవ పూర్తి చేసుకున్న తర్వాత అందరిలా గబా.. గబా.. కిందికి దిగిపోకుండా పరవశంతో.. ప్రకృతి కొలువుదీరిన అక్కడి కొండలపై అటు ఇటు కలియ తిరిగిన ప్రియా ఆనంద్, తాను ‘ప్రియా ఆనంద పరవశం’ చెందిన ఫొటో, వీడియోలను సామాజిక మాధ్యమా ల ద్వారా పంచుకుంది.