జిల్లా ఆసుపత్రిలో ఎంఆర్‌ఐ సేవలు
01-07-2026 01:44 AM
వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం
జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) జూన్ 30 (విజయక్రాంతి): ప్రజలకు అత్యాధునిక, నాణ్యమైన వైద్య సేవలను అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీఎస్‌ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఎం.ఆర్.ఐ యంత్రాన్ని సోమవారం సీఎం హైదరాబాద్ నుండి వర్చువల్ విధానంలో ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ కృష్ణా రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, ట్రేడ్ ప్రమోషన్ కార్పోరేషన్ చైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.






