29 June, 2026 | 5:05 PM

Breaking News

మా నేతను గెలిపిస్తామని బీజేపీ కార్యకర్తలు ధీమా కల్పించాలి   •   చేనేత సంఘం మండల అధ్యక్షునిగా పర్వతం వేణుగోపాలరావు   •   ఖమ్మం హనుమకొండ బస్సు సర్వీసులను పునరుద్ధరించాలి   •   రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి ఆర్థిక సాయం   •   జిల్లాలో క్రైమ్ ఫ్రీ డివిజన్ల ఏర్పాటుకు ప్రజల భాగస్వామ్యం కీలకం   •   విద్యాశాఖ నిర్లక్ష్యంపై కలెక్టరేట్ ముందు నిరసన   •   గిరిజన హక్కులు పరిరక్షణకై న్యాయం చేయాలి   •   నిరుద్యోగులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం   •   నగరపాలక సంస్థలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   గంగమ్మ జాతర మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్   •  

జులై 7న ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించాలి

15-06-2025 11:40 PM

చిలుకూరు: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ(MRPS founder Manda Krishna Madiga) ఆదేశాల మేరకు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా మండల కేంద్రాలలోని నూతన గ్రామ శాఖలు మండల శాఖలు నిర్మాణంలోని భాగంగా ఆదివారం, చిలుకూరు మండలం నారాయణపురం గ్రామంలో జరిగిన, ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి, నూతన గ్రామ కమిటీ ని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మల్లెపంగు సూరిబాబు, మాదిగ అధ్యక్షతన నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి రాష్ట్ర నాయకులు చిలుకూరు మండల ఇన్చార్జ్, కొండపల్లి ఆంజనేయులు, మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి చిలుకూరు మండల కో ఇన్చార్జ్ ఏపూరి సత్యరాజు మాదిగలు పాల్గొని వారు మాట్లాడుతూ... జులై 7న, జరిగే ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని గ్రామ గ్రామాన జెండా దిమ్మెలు నిర్మించుకొని ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని అన్నారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ తన జీవితాన్ని మాదిగ సమాజం కోసం అంకితం చేశాడని ఆయన పోరాట ఉద్యమ ఫలితమే ఈరోజు ఏబిసిడి వర్గీకరణ జరిగిందని ఈ వర్గీకరణ ఎస్సీలుగా పిలవబడే 59 ఉప కులాలకు వర్తిస్తుందని, రాబోయే రోజుల్లో చదువుకున్న ప్రతి ఎస్సీ కులానికి చెందిన బిడ్డలు లాభం పొందుతారని వారు అన్నారు.

ఈ ఆవిర్భావ వేడుకలలో మాదిగ సమాజానికి చెందిన ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో, కందుకూరి శ్రీను, కందుకూరి వెంకటయ్య, కందాల సైదులు, చెడపంగు కుటుంబరావు, చిలక సైదులు, గుండె పంగు ధన మూర్తి, మాగి నరసయ్య, మీసాల నరేష్, చెడ పంగు నరేష్, చెడపంగు గాంధీ, నాగ లక్ష్మయ్య, కందుకూరి నాగరాజు, కాంతారావు, తిరపతి, కార్తీక్, జాను, నందా, వెంకటి,గోపాల్,రాకేష్,సాయి, రాకేష్, తదితరులు పాల్గొన్నారు.