ముఫాసా ఎమోషనల్ రైడ్
02-12-2024 01:23 AM
‘ముఫాసా: ది లయన్ కింగ్’ చిత్రం ఇదే నెల 20న భారతదేశవ్యాప్తంగా ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది. బారీ జెంకిన్స్ డైరెక్షన్‌లో 2019లో వచ్చిన ‘ది లయన్ కింగ్’కు సీక్వెల్‌గా వస్తోంది. ఈ భాగానికి సుజై ఘోష్ దర్శకత్వం వహించారు. ఇందులోని ‘ముఫాసా’ పాత్రకు తెలుగు వెర్షన్ డబ్బింగ్‌ను టాలీవుడ్ స్టార్ మహేశ్‌బాబు చెప్పారు. తాజాగా ఆదివారం ఈ సినిమా పోస్టర్‌ను నమ్రతా శిరోద్కర్ ఘట్టమనేని హైదరాబాద్‌లో విడుదల చేశారు.
టాకా పాత్రకు వాయిస్ హీరో సత్యదేవ్, టిమోన్ పాత్ర వాయిస్ ఇచ్చిన అలీ ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నమ్రత మాట్లాడుతూ.. ‘ఇది ఫ్యామిలీ ఫిల్మ్. ఎమోషనల్ రైడ్. మహేశ్ బాబు చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పారు’ అన్నారు.






