కొత్త సినిమా షూట్ మార్చిలో
వరుణ్‌తేజ్ కథానాయకుడిగా డైరెక్టర్ మేర్లపాక గాంధీ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై ఈ సినిమా భారీ స్థాయిలో రూపొందనుంది. వరుణ్‌తేజ్.. దర్శకుడు గాంధీ, యూవీ క్రియేషన్స్‌తో కలిసి పనిచేయడం ఇదే తొలిసారి. తేజ్ గతంలో ‘కంచె’ చిత్రం కోసం ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో చేతులు కలపగా.. ఆ చిత్రం విమర్శకులు, ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది.
యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ను అందించిన గాంధీ ఇప్పుడు వరుణ్‌తేజ్‌తో చేస్తున్న ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు ఒక యూనిక్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించబోతున్నాడని మేకర్స్ పేర్కొంటున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి రెగ్యులర్ షూటింగ్‌ను 2025, మార్చిలో ప్రారంభించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలో తెలియజేయనున్నారు.






